మీ అన్న చిరంజీవి రాజకీయాల్లోకి రాక ముందునుంచే మా కుటుంబం రాజకీయాల్లో ఉందని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. “నీవి నారా వారి నరాలు, నీలో ప్రవహిస్తున్నది పుసుపు రక్తం’ అంటూ ధ్వజమెత్తారు. పవన్-చంద్రబాబు రెండు గంటలసేపు కూర్చుని ఏం మాట్లాడుకుంటారని, నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు – నాకెంత ప్యాకేజీ అని తప్ప మరేం ఉంటుందని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ వారు తన తల్లిని తిట్టారని గతంలో ఏడ్చిన పవన్ ఇపుడు వారి పల్లకీనే మోస్తున్నారని అటువంటి పవన్ ను బానిస అనక బాహుబలి అంటారా అని గుడివాడ మండిపడ్డారు.
పవన్ ముమ్మాటికీ ఓ ప్యాకేజ్ స్టార్ మాత్రమేనని, కేవలం మంత్రులను తిట్టడానికి నిన్న రణస్థలిలో సభ పెట్టారని, నిన్నటి స్పీచ్ లో ఆంబోతులా రంకెలు వేశారని…. అసలు ఆయనకు, ఆయన పార్టీకి ఒక విధానం అంటూ ఏదీ లేదని మంత్రి విమర్శించారు. రాజకీయాల్లో జగన్ హీరో అయితే పవన్ కళ్యాణ్ విలన్ అని అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని, కానీ అయన మాటలు పతివ్రతలా ఉన్నాయని, ఇలాంటి వ్యక్తీ దేశంలో ఎక్కడా ఉండరని, అలాంటి వాడి నోటినుంచి తనపేరు ఉచ్చరించకపోవడమే మందిదని అమర్నాథ్ అన్నారు. జనసేన పార్టీ పేరు మార్చుకొని చంద్రసేన అని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. పవన్ ఇప్పటికైనా ఓపెన్ అయిపోవాలని, తన పార్టీని టిడిపిలో కలిపేసుకోవచ్చని, ఇద్దరూ వేర్వేరు పార్టీలు, యాత్రలు ఎందుకని… లోకేష్ పాదయాత్ర చేస్తుంటే, అయన వెనుకే పవన్ బస్సులో తిరగొచ్చని సూచించారు. కనీసం పేర్లు కూడా వేర్వేరుగా పెట్టుకోలేని ఆలోచనలో ఉన్నారని, లోకేష్ యువ గళం అంటే, పవన్ యువ శక్తి అని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.