Sunday, January 19, 2025
Homeసినిమానెల రోజుల గ్యాప్ లో వస్తున్న ముగ్గురు మొనగాళ్లు  

నెల రోజుల గ్యాప్ లో వస్తున్న ముగ్గురు మొనగాళ్లు  

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబోలో రూపొందుతున్న ఫస్ట్ మూవీ ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. తమిళ్ లో విజయం సాధించిన వినోదయ సీతంకు రీమేక్ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటీవల పవన్, తేజ్, ఊర్వశీ రౌటేలా పై స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని జులై 28న విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

బ్రో మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ రానుంది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల భోళా శంకర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో చిరుకు జంటగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భోళా శంకర్ పై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక భోళా శంకర్ విడుదలైన రెండు వారాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ ఆగష్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య కథానాయిక. ఇదొక స్పై థ్రిల్లర్ మూవీ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాతో వరుణ్ కి సక్సెస్ చాలా అవసరం. ఇలా నెల రోజుల గ్యాప్ లో మెగా హీరోల నుంచి మూడు సినిమాలు వస్తుండడం విశేషం. మరి.. బాక్సాఫీస్ దగ్గర ముగ్గురు మొనగాళ్లు ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్