పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగు చిత్రాల్లో ఎప్పటి నుంచో సెట్స్ పై ఉన్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తవ్వాలి.. ఈపాటికి రిలీజై ఉండాలి కానీ.. ఇంకా సెట్స్ పైనే ఉంది. సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు.
అసలు విషయానికి వస్తే… నాలుగు సినిమాల పవన్ షెడ్యూల్ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని ప్రకారం ముంబైలో ‘ఓజీ’ షూటింగ్ పాల్గొన్న పవన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. వచ్చే మంగళవారం మధ్యాహ్నం ఆయన ముంబైకి వెళ్లి మే ఆరో తేదీ వరకూ ఓజీ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వినోదయ సీతం’ రీమేక్ కి కొన్ని డేట్స్ కేటాయించారని సమాచారం. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఓ పాట కోసం పవన్ షూటింగ్ పాల్గొంటారని, అది పూర్తయిన వెంటనే హరిహర వీరమల్లు సెట్ లో అడుగుపెడతరు.
అలాగే, వీరమల్లుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఓ అప్‌డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది. ఇక, జూన్ చివరి వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ పాల్గొంటారు. ఇది పవన్ చేస్తున్న నాలుగు సినిమాల షెడ్యూల్ అని.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మొత్తానికి ఎన్నికల లోపు ఈ నాలుగు సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే ఈ సినిమాలను పూర్తి చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఏది ఏమైనా సంవత్సరాకి ఒక సినిమా చేసే పవన్ ఇలా వరుసగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావడం విశేషం.