Saturday, January 18, 2025
Homeసినిమామెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ మూవీ..?

మెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ మూవీ..?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ అనే సినిమా చేశారు. ఇలా వరుసగా సక్సెస్ లు సాధించడంతో  పవన్ నెక్ట్స్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. క్రిష్ డైరెక్షన్ లో  ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. ఇది పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే.. పవన్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొత్త సినిమాలకు కూడా ఓకే చెప్పారని తెలిసింది. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వీరమల్లు లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇక అసలు విషయానికి వస్తే.. కొత్తగా మరో సినిమాకి పవన్ ఓకే చెప్పారట. ఇంతకీ ఎవరితో అంటే.. అన్నయ్య చిరంజీవితో ‘భోళా శంకర్’ మూవీని తెరకెక్కిస్తున్న రమేష్ తో  పవన్ ఓ భారీ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

మెహర్ రమేష్. తాను లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఈ విషయం వెల్లడించారు. రమేష్‌.. చిరంజీవితో చేస్తున్న భోళా శంకర్ మూవీ దాదాపు సగం పూర్తయ్యింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ మూవీ షూటింగ్ లో స్పీడు పెంచనున్నారు. మార్చికి షూటింగ్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఆతర్వాత మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలి అనుకుంటున్నారు. మరి.. అనుకున్నట్టుగా పవన్, మెహర్ రమేష్‌ మూవీ సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్