Sunday, January 19, 2025
HomeసినిమాPawan Kalyan: పవన్ 8 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేస్తారా..?

Pawan Kalyan: పవన్ 8 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేస్తారా..?

పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత భీమ్లా నాయక్ అంటూ సినిమా చేశారు. రీ ఎంట్రీలో ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే.. భీమ్లా నాయక్ సినిమా కంటే ముందుగా ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉంది కానీ.. ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఎంత షూటింగ్ అయ్యింది..? ఇంకా ఎంత షూట్ చేయాలి..? అనేది క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే… పవన్ 8 నెలల్లో 4 సినిమాలను విడుదల చేయాలి అనుకుంటున్నారట. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ.. ఇది నిజం అని టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే.. ఎన్నికలు సమీపిస్తుండడంతో సాధ్యమైనంత త్వరగా ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకనే ఇలా 8 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇంతకీ ఆ నాలుగు సినిమాలు ఏంటంటే.. వినోదయ సీతం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్షన్ లో చేస్తున్న వినోదయ సీతం షూట్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రాన్ని జులై 28న విడుదల చేయనున్నారు.

ఇక ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న వీరమల్లు చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారట. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఓజీ’ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలనేది ప్లాన్. ఈ మూవీని దానయ్య నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఇలా 8 నెలల్లో 4 సినిమాలు విడుదల చేయాలి అనుకుంటున్నారట. జరిగితే బాగానే ఉంటుంది మరి.. నిజంగా జరుగుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్