Sunday, January 19, 2025
HomeTrending NewsPawan Kalyan: ద్వారంపూడి నేర సామ్రాజ్యం కూలుస్తా

Pawan Kalyan: ద్వారంపూడి నేర సామ్రాజ్యం కూలుస్తా

కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, డబ్బులు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన నేర సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి ఆయనతో పాటు సిఎం జగన్ ను రోడ్డు మీదకు తీసుకు వస్తామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేవని చెబుతోందని కానీ తన బినామీ కంపెనీలు PLR ఇన్ఫ్రా – మిథున్ రెడ్డి కంపెనీకి 600 కోట్లు, రాఘవ కన్స్ట్రక్షన్ – శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి 300 కోట్లు, MRKR  – రఘునాథ రెడ్డి కంపెనీకి 250 కోట్లు; VPR ప్రభాకర్ రెడ్డి కంపెనీకి – 50 కోట్లు మాక్స్ ఇన్ ఫ్రా  ఫణి కుమార్…. వీళ్ళందరికీ కలిపి 1,500 కోట్లు విడుదల చేసిందని  పవన్ ఆరోపణలు  చేశారు.  తాను ఎక్కడ నిలబడితే అక్కడ 200 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఓడించేందుకు వైసీపీ సిద్ధపడుతోందని, తనను మీరే కాపాడాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ లో జరిగిన సభలో పవన్ ప్రసంగించారు.

పవన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు రిటైర్మెంట్ హబ్ అని పిలుస్తారు.. మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది..
  • ప్రజాస్వామ్యం అనేది మన నాయకులు సరిగ్గా లేకపోతే అస్తవ్యస్తంగా అయిపోతుంది.. స్వలాభం చూసుకుంటే కాకినాడలాగా సమస్యల్లో ఉంటుంది.
  • నాకు ఈ కౌన్ కిస్కా కాకినాడ గొట్టం ఎమ్మెల్యేతో గొడవ ఏముంది….. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే ఇంతే.
  • ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాకినాడ ఎమ్మెల్యే లాంటి క్రిమినల్స్ కి అండగా ఉంటే మనం ఏం చేయాలి.. క్రిమినల్స్ కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేస్తున్నారు..
  • స్థానిక కాకినాడ ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తప్ప తాగి, అహంకారంతో ఏమైనా వాగొచ్చు అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాడు… దిగజారుడు బూతులు మాట్లాడుతుంటే మా నాయకులు తెలియజేశారు..
  • అప్పట్లో ఎస్పీ డీటీ నాయక్ దొంగనోట్లు, అక్రమ మద్యం, అరాచకాలు చేసే ద్వారంపూడి కుటుంబ సభ్యులను బేడీలు వేసి రోడ్ల మీద నడిపించారు..
  • మా జనసైనికులు, మహిళలు, నాయకుల మీద రాళ్ళ దాడి చేశారు ద్వారంపూడి అనుచరులు… నేను వస్తున్నా అనగానే 144 సెక్షన్ పెట్టారు తూర్పు గోదావరి జిల్లా అంతా
  • ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనేవాడు నా కోపం అణుచుకోవడం వలన బతికిబట్టకట్టాడు.
  • ప్రజలకు మంచి చేస్తే నాకు ఇబ్బంది లేదు… రౌడీయిజం, లూటీ, కబ్జాలు చేస్తే నా లాంటి వాడు సహించలేడు….. వీళ్ళు మనుషుల్ని సమాజాన్ని కులాలుగా విడదీసి రాజకీయం చేస్తూ, ద్వేషాలు పెంచుతున్నారు..
  • ఇంకొసారి కులదూషణ చేసావా, రెచ్చగొట్టావా ఇక మర్యాదగా చెబుతున్నాను….. పద్దతి మార్చుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.
  • ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెనుక తిరిగే దళిత, కాపు యువకులకు చెబుతున్నాను…..మీ దళిత డ్రైవర్ ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీ, మీ పథకాలు పీకేసిన ముఖ్యమంత్రి, ఈ డెకాయిట్ వెనుక తిరిగే మీకు ఈ విషయాల మీద అవగాహన తెచ్చుకుని నడుచుకోండి.
  • క్రైమ్ చేసే వాడు ఏ కులమైనా వదిలేదే లేదు…. కాకినాడ అర్బన్ లో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఓడించే బాధ్యత నాది.
  • ఈ రోజు నుండి ఉభయగోదావరి జిల్లాల్లో ఎవడు మీపై గూండాగిరి చేసినా, మీకు అండగా నేనుంటాను..
  • బాపట్లలో గౌడ కులానికి చెందిన ఒక పిల్లాడిని రెడ్డి కులం వాడు తగలపెట్టి చంపేశాడు…..వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుపడినందుకు ఈ పరిస్థితి..
  • కాకినాడ నుండి పిఠాపురం వరకు, గోదావరి జిల్లాల్లో ద్వారంపూడి అనేవాడు ముఖ్యమంత్రి అని చెబుతూ ఉన్నారు….. రైస్  ఎగుమతిలో 15,000 కోట్లు వెనకేశాడు… అన్నీ అక్రమాలే….బలహీనులని పీక్కుతింటున్నాడు…ఏ మూలకి వెళ్ళినా ఈ డెకాయిట్ దోపిడీలు చేస్తున్నాడు.
  • ఇక్కడ ఉన్న యువతకు చెబుతున్నాను… కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు… కాపు రిజర్వేషన్ కోసం ఏ గవర్నమెంట్ లో అయినా ఒకేలా ఉండాలి…మీ ఎదుగుదల కోసం కాపు కులాన్ని వాడుకోవద్దు..
  • దళితులను, గౌడ బిడ్డలను చంపుతుంటే దళిత, గౌడ నాయకులకు కోపం రాలేదా?
  • బిడ్డ చనిపోతే లక్ష చేతిలో పెట్టి తప్పును కప్పేస్తున్నారు..
  • సినిమాల్లో మీరు ఎవరి అభిమాని అయినా సరే రాజకీయంగా మీరు అందరూ జనసేనకి మద్దతు ఇవ్వండి…యువత మారాలి.
  • ఏ కులమైనా మీరు ఆలోచించాల్సింది మీకు ఉద్యోగాలు, ఉపాధి, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి ఈ ప్రభుత్వం చేయడం లేదు.
  • క్యాపిటలిజం,సోషలిజం లాంటివి మీరు అవగాహన చేసుకోవాలి…. డబ్బు ఉన్న వాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు, లేని వాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నారు.
  • నిజజీవితంలో పోరాడాలంటే గట్స్, దమ్ము, ధైర్యం ఉండాలి ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఎదుర్కోవాలంటే…. అందుకే జనసేనకి అవకాశం ఇవ్వండి

అంటూ పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్