Sunday, January 19, 2025
Homeసినిమాపవన్, సుజిత్ మూవీ వెనుకున్న సీక్రెట్ ఇదేనా.?

పవన్, సుజిత్ మూవీ వెనుకున్న సీక్రెట్ ఇదేనా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓ వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ఆతర్వాత భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలతో సక్సెస్ సాధించడంతో నెక్ట్స్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం పవర్ స్టార్ హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న వీరమల్లు సినిమా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కి వీరమల్లు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే… వీరమల్లు తర్వాత భవదీయుడు భగత్ సింగ్ చేయాలి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తానని పవన్ ప్రకటించారు. సముద్రఖని డైరెక్షన్ లో వినోదయశితం రీమేక్ చేయాల్సివుంది. ఈ సినిమాలే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు పూర్తవుతాయో క్లారిటీ లేదు. అలాంటిది సుజిత్ తో సినిమా చేయడం ఏంటి..? ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? అసలు సుజిత్ పవన్ కళ్యాణ్ ను ఎలా ఒప్పించాడు..? దీని వెనుక ఏం జరిగింది..? అనేది ఆసక్తిగా మారింది. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే…. సుజిత్ మూవీలో పవన్ కళ్యాణ్ కనిపించేది తక్కువ సేపే అట. సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల వరకు పవన్ స్ర్కీన్ పై కనపడరట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని.. సినిమా అంతా పవన్ మీదే ఉంటుంది కానీ.. ఆయన పాత్ర నిడివి తక్కువ అని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే.. పవన్ కు తక్కువ టైమ్ లో, తక్కువ కష్టంతో ఫుల్ లెంగ్త్ రెమ్యూనిరేషన్ అన్నమాట. పవన్ ని ఒప్పించాలంటే.. ఇలానే కథ రెడీ చేసుకోవాలి ఏమో అంటున్నారు సినీ జనాలు.

Also Read : పవన్ మూవీ గురించి.. ప్రభాస్ కామెంట్స్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్