Sunday, January 19, 2025
HomeTrending Newsప్రధానికి డెడ్ లైన్లు పెట్టండి: నాని సలహా

ప్రధానికి డెడ్ లైన్లు పెట్టండి: నాని సలహా

Pawan Kalyan To Set Deadline For Pm On Steel Plant Nani Suggest :

ఇప్పటికే చచ్చిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేమిటని జన సేన పార్టీని ఉద్దేశించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. వారంరోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన అల్టిమేటంపై నాని స్పందించారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చినందుకు పవన్ ను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు.

డెడ్ లైన్లు మాకు పెట్టడం కాదని, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి డెడ్ లైన్లు పెట్టాలని, వారం రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ఊరుకోమని చెప్పాలని, అవసరమైతే జానీ సినిమా చూపించాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.  రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు భయపడేవాళ్ళు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.

Must Read :కోపం వచ్చినప్పుడు పిలవండి: పవన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్