Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య షోలో పవర్ స్టార్?

బాలయ్య షోలో పవర్ స్టార్?

నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో సెకండ్ సీజన్ కు మరింత క్రేజ్ ఏర్పడింది. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ను చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేశారు. రాజకీయ నాయకులను, సినీ ప్రముఖులను తనదైన స్టైల్ లో ఇంటర్ వ్యూ చేస్తూ.. టాక్ షోను రక్తి కట్టిస్తున్నారు బాలయ్య. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు పిలిచారు బాలయ్య. దీనికి సంబంధించిన రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

త్వరలోనే బాలయ్య, బాహుబలిల ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే.. ఈ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఈ టాక్ షోలో బాలయ్య.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు షోకు అని అడిగితే.. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తాను అని త్రివిక్రమ్ అంటే… దీనికి బాలయ్య.. ఎవరితో రావాలో తెలుసు కదా.. అనడం.. దీనికి త్రివిక్రమ్ నవ్వడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకు రావడం ఖాయం అనే టాక్ మరింత ఊపందుకుంది.

అయితే… ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను ఆహా ఓటీటీ విడుదల చేసింది. మరో వైపు హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాత నాగ వంశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో 27వ తేదీ కోసం ఆహా చూడండి అంటూ చెప్పడం, అలానే ఆహా వారు కూడా అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ గెస్ట్ ఎవరో గెస్ చేయండి అంటూ ట్వీట్  చేయడం వంటివి చూస్తుంటే పవర్ స్టార్ ఈ షోలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే.. ఈ ఎపిసోడ్ కు రికార్డ్ వ్యూస్ రావడం ఖాయం. మరి.. పవర్ స్టార్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్