Sunday, April 13, 2025
HomeTrending NewsSajjala: అభిమానుల ఆశలు పవన్ తాకట్టు: సజ్జల

Sajjala: అభిమానుల ఆశలు పవన్ తాకట్టు: సజ్జల

చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ ఎజెండా అనే విషయం నేడు మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సిఎం కావాలన్న ఆయన అభిమానుల ఆశలను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడన్నారు.  పవన్ ను మంచి పదవిలో చూడాలనుకున్నవారి ఆశలు నేటితో పటాపంచలు అయ్యాయన్నారు.

గత ఎన్నికల్లో తనను ఎక్కువ సీట్లలో గెలిపించి ఉంటే ఇప్పుడు సిఎం పదవి అడగడానికి అవకాశం ఉండేదని పవన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉందని, అంటే ఆయన ప్రజలను తప్పుబడుతున్నట్లు అర్ధమవుతుందన్నారు.  తనకు బలం లేదని పవన్ ఇప్పటికైనా అంగీకరించారని, ఆయన ఇమేజ్ నీటి బుడగ లాంటిదన్నారు.  సిఎం జగన్ ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా బలంగా ఎదిగారని, అలాంటి నేతను ఎదుర్కోవడానికి పొత్తులు పెట్టుకుంటున్నారని, దీనితో జగన్ ఎంత బలంగా ఉన్నారో తెలుస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్