Sunday, January 19, 2025
Homeసినిమాపవన్, తేజ్ మూవీ టైటిల్?

పవన్, తేజ్ మూవీ టైటిల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘వినోదయ సీతం’ రీమేక్ రూపొందుతోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే… స్క్రీన్ ప్లే – సంభాషణలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించడం విశేషం. ఈ సినిమాలో పవన్ దేవుడు పాత్ర పోషిస్తున్నారు. కథ విషయానికి వస్తే… సాయిధరమ్ తేజ్ కు లైఫ్ లో దేవుడు మరో ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు అతని లైఫ్ లో ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో రూపొందుతోంది.

సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించలేదు. అయితే.. ఆ మధ్య ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలొచ్చినా ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా దీనిపై ఓ వార్త బయటకు వచ్చింది. ఓ క్లాసీ టైటిల్ ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. ఆ టైటిల్ కు పవన్ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. ఈ నెలలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో ‘నేను కాలాన్ని’.. అంటాడట పవన్ కళ్యాణ్. కాలాన్ని వెనక్కి తిప్పి, సాయిధరమ్ తేజ్ కు జీవితంలో మరో అవకాశాన్నిచ్చే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీ స్టుడియోస్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడంతో పాటు.. థియేట్రికల్ షేర్ కూడా అందుకోబోతోంది జీ గ్రూప్. జులై 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. అయితే.. ప్రస్తుతానికి ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది సస్పెన్స్. అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్