జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవలి రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం స్వయంగా అందించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజి నిర్మాణంలో భాగంగా గ్రామంలోని కొన్ని ఇళ్ళ ప్రహరీ గోడలు ప్రభుత్వం కూల్చి వేయాల్సి వచ్చింది. కొన్ని ఇళ్ళను అధికారులు పాక్షికంగా తొలగించారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఈ నిర్మాణాలు తొలగించారని జనసేన ఆరోపించింది. ఈనెల 5న పవన్ ఇప్పటంలో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. పవన్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
అనంతరం ఈనెల 8న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేస్తూ దెబ్బతిన్న ఇళ్ళకు ఒక్కో కుటుంబానికి పవన్ లక్ష రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాన్ని ప్రకటించారు. దీనిలో భాగంగా పవన్ 27న స్వయంగా ఇప్పటంలో పర్యటించి బాధితులకు సాయం పంపిణీ చేయనున్నారు.
Also Read : మా వ్యూహం మాకుంది: పవన్ కళ్యాణ్