Saturday, March 1, 2025
HomeTrending NewsJana Sena: సత్యదేవుడికి సన్నిధిలో పవన్-నేటినుంచి వారాహి యాత్ర

Jana Sena: సత్యదేవుడికి సన్నిధిలో పవన్-నేటినుంచి వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ఈ సాయంత్రం మొదలు కానుంది. అన్నవరం నుంచి మొదలు కానున్న ఈ యాత్ర  ర్యాలీగా  బయల్దేరి కత్తిపూడిలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ రాత్రికి గొల్లప్రోలులో బస చేస్తారు. కాగా, పవన్ కళ్యాణ్ ఈ ఉదయం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అన్నవరం గుడి వద్దకు చేరుకొని పవన్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సంప్రదాయ బద్ధంగా పవన్ కు స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం జిల్లా పార్టీ నేతలతో పవన్  భేటీ అయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై వారితో చర్చలు జరిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్