Saturday, February 22, 2025
HomeసినిమాMangalavaram: ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పాయల్! 

Mangalavaram: ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పాయల్! 

Mini Review: పాయల్ అంటే గ్లామర్ .. గ్లామరస్ పాత్రలలో ఆమెను చూడాలనే కుర్రాళ్లు కోరుకుంటారు. ‘RX 100’ సినిమా హిట్ కావడానికి సగం కారణం కథాకథనాలు అయితే, మరో సగం కారణం పాయల్ గ్లామర్ .. ఆమె పాత్రకి ఇచ్చిన రొమాంటిక్ టచ్ అనే చెప్పుకోవాలి. పాయల్ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ, హాట్ బ్యూటీగానే ఆమెకి క్రేజ్ ఉంది. ఆ తరహా పాత్రలలో ఆమెను చూడటానికే యూత్ ఇష్టపడుతోంది. ఇక అలాంటి పాత్రలను చేయడానికి ఆమె ఏ మాత్రం మొహమాటపడకపోవడం కూడా ఇందుకు మరో కారణం.

అలాంటి పాయల్ నుంచి ‘మంగళవారం‘ సినిమా వచ్చింది. నిన్ననే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అజయ్ భూపతి ‘RX 100’ సినిమాలో పాయల్ ను చాలా అందంగా ఒక రేంజ్ లో చూపించాడు. అందువలన ఈ సినిమాలోను ఆమె అదే విధంగా కనిపిస్తుందని ఆడియన్స్ ఆశించారు. కానీ ఈ సినిమాలో ఆమె డీ గ్లామర్ లుక్ తో కనిపించింది. నిజంగా ఇది ఆమె ఫ్యాన్స్ ను నిరాశపరిచిన విషయం అనే టాక్ థియేటర్స్ దగ్గర వినిపిస్తోంది.

అయితే కథ విలేజ్ నేపథ్యంలో జరుగుతుంది గనుక .. విలేజ్ నేపథ్యంలోనే ఆమె పుట్టి పెరుగుతుంది గనుక అజయ్ భూపతి ఆమె పాత్రను అలా డిజైన్ చేశాడు. పైగా ఈ కథ 1986 – 96లలో జరుగుతుంది గనుక, ఆ కాలానికి తగినట్టుగా చూపించడానికి ఆయన ట్రై చేశాడు. అయితే పాయల్ ను గ్లామరస్ గా చూడటానికి ఇష్టపడే కుర్రాళ్లకి మాత్రం ఇది రుచించలేదనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా హాట్ బ్యూటీగా క్రేజ్ ఉన్న ఒక హీరోయిన్ ను .. గ్లామరస్ పాత్రలలో మెప్పిస్తూ వస్తున్న ఒక హీరోయిన్ ను డీ గ్లామర్ లుక్ లో అజయ్ భూపతి చూపించాలనుకోవడం సాహసంగానే చెప్పుకోవాలి.

Also Read: పాయల్ మంగళవారం తో మళ్లీ పుంజుకోనుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్