Sunday, January 19, 2025
HomeTrending Newsయూత్ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం

యూత్ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం

కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులను తయారు చేసిందని, చంద్రబాబు… కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే అని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

శంషాబాద్ లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులు, ఈ సందర్భంగా నేతలు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 72 అసెంబ్లీ సీట్లు సాధించే దిశగా 20 నెలలు కష్టపడాలని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి  మనిక్కమ్ ఠాగూర్ పిలుపు ఇచ్చారు. మన టార్గెట్ 72 సీట్లు.. 20 నెలల సమయం ఉందని, కష్టపడితే యూత్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉంటుందని మనిక్కమ్ ఠాగూర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అందరూ కష్టపడి పని చేయండని,  క్రమశిక్షణతో పని చేయండి అవకాశాలు వస్తాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్