Saturday, January 18, 2025
Homeసినిమా‘రామ్ అసుర్' టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్

‘రామ్ అసుర్’ టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌ పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “పీనట్ డైమండ్”. ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని  టైటిల్ ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.

అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం . సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న `రామ్ అసుర్` చిత్రం. టైటిల్ ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపు కున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమిషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని `రామ్ అసుర్’ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ .. ఫస్ట్ నీ మూవీని  ఓటిటిలో విడుదల చేయాలనుకొని “పీనట్ డైమండ్” అనే ఇంగ్లీష్ టైటిల్ టైటిల్ పెట్టడం జరిగింది, కానీ మూవీ జరుగుతున్న ప్రాసెస్ లో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ చాలా గ్రాండ్ గా రావడం జరిగింది. దీంతో చాలా మంది వెల్ విషర్స్  ప్రస్తుతం కోవిడ్ సాధారణ స్థాయికి వచ్చింది కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయమని సలహాలు ఇవ్వడంతో ఆ రకంగా సన్నాహాలు చేస్తున్నాము, అయితే.. మాస్ ఆడియన్స్ కు, కమర్షియల్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి కనుక “పీనట్  డైమండ్” ఇంగ్లీష్ టైటిల్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని  “రామ్ అసుర్” గా టైటిల్ మార్చడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్