Sunday, January 19, 2025
HomeTrending Newsపెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టర్‌ చాంబర్‌లోని సీట్‌లో కలెక్టర్‌ సంగీతను కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద జిల్లా పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సీఎస్  సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పెద్దపల్లి పట్టణం పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో 22 ఎకరాల్లో కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం రూ.48.07 కోట్లతో నిర్మించింది. ఈ భవనంలో మొత్తం ఆరు బ్లాకులు, 98 గదులను నిర్మించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో 40..,మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు ఉన్నాయి. భవన సముదాయంలో 41 శాఖలకు కార్యాలయాలున్నాయి. గ్రౌండ్ ఫోర్‌లో సంక్షేమం, మత్య్స శాఖ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు శాఖలకు సంబంధించిన ఛాంబర్లను ఏర్పాటు చేశారు. రూ.7 కోట్లతో పాలనాధికారి, అదనపు పాలనాధికారులకు సంబంధించిన క్యాంపు కార్యాలయాల్లో అధికారులు నివాసం ఉంటున్నారు. మరో ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారులు నివాస గృహాలు సైతం సిద్ధమయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్