Sunday, January 19, 2025
HomeTrending Newsఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. సంస్థకు మరింత తోడ్పాటును అందించేందుకు ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్న శ్రీమతి షమీమ్ అస్లాంను  చైర్ పర్సన్ గా ప్రభుత్వం నియమించిందని, అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థకు మధ్య ఆమె వారధిగా నిలుస్తారని అన్నారు. సచివాలయంలో ఎపిఎండిసి పై శ్రీమతి షమీమ్ అస్లాంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి  వివిధ విభాగాల వారీగా సంస్థ పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.

  • ఎపిఎండిసి జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో తన కార్యక్రమాలను విస్తరిస్తోంది
  • ఇప్పటికే మధ్యప్రదేశ్, జార్ఖండ్,  చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఖనిజ వెలికితీతకు ఏపీఎండీసీ శ్రీకారం చుట్టింది
  • సులియారీ కోల్ మైన్స్ లో పనులు ప్రారంభమయ్యాయి, బ్రహ్మదియా కోల్ మైన్ లో కూడా పనులు ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది
  • బైరటీస్ ఖనిజ వెలికితీత కార్యక్రమాల ద్వారా ఎపిఎండిసి అంతర్జాతీయ మార్కెట్లో కీలక స్థానంలో నిలుస్తోంది
  • రాష్ట్రంలో గ్రానైట్, బీచ్ శాండ్, సిలికాశాండ్, కాల్సైట్, బాల్ క్లే వంటి ఖనిజ వనరులను కూడా వెలికి తీయడం ద్వారా సంస్థ తన  సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది
  • మైనింగ్ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది
  • కడపజిల్లా మంగంపేటలోని బెరైటీస్ మైనింగ్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎపిఎండిసి పౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందించడం,  ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేస్తున్నాం
  • మంగంపేట కేంద్రంగా కేంద్రంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం
  • అలాగే కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించేందుకు 72 హ్యాబిటేషన్లలో  ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను  నిర్వహిస్తున్నాం
  • మైనింగ్ కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
  • ప్రభుత్వ తోడ్పాటుతో భవిష్యత్తులో ఏపీఎండీసీ మరిన్ని రాష్ట్రాల్లో ఖనిజ వెలికితీత కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది

ఈ సమీక్షలో గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సంస్థ సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్