Thursday, February 13, 2025
HomeTrending Newsఉపాధి కల్పనలో పీఎల్ఆర్ జాబ్ సెంటర్ తోడ్పాటు  

ఉపాధి కల్పనలో పీఎల్ఆర్ జాబ్ సెంటర్ తోడ్పాటు  

పీఎల్అర్ జాబ్ సెంటర్ ద్వారా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పుంగనూరు నియోజకవర్గంతో పాటు  మూడు జిల్లాల పరిధిలో  యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నారు.   శిక్షణ అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి నేడు మంత్రి పెద్దిరెడ్డి నియామక పత్రాలు  అందించారు. మొత్తం 109 మంది నేడు ఉద్యోగాలు పొందిన వారిలో ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పుంజుకోవాలనే ముఖ్య ఉద్దేశం తో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో జాబ్ మేళాల ఏర్పాటుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నడుంబిగించారు.

ఇప్పటి వరకు మూడు జిల్లాల పరిధిలో 11897 మందికి ఉద్యోగాలు లభించారు. ఒక్క పుంగనూరు నియోజకవర్గం లో మొత్తం 6127 మంది ఉపాధి పొందగా 161 మంది ఆర్మీకి ఎంపికయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్