Bheri Success: బీసీ మంత్రులను డమ్మీలు చేసిన చరిత్ర చంద్రబాబుదైతే నని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర ముగింపు బహిరంగ సభలో పాల్గొనేందుకు అనంతపురం లో పర్యటిస్తున్న పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ సిఎం అయిన తర్వాతే అసలైన సామాజిక న్యాయం రాష్ట్రంలో వచ్చిందని, అన్ని కులాలకూ పదవులు ఇచ్చి వారికి రాజకీయంగా గుర్తింపు ఇచ్చారని, గతంలో ఎన్నడూ రాజకీయ పదవుల్లో తమ కులానికి కనీస ప్రాధాన్యం లేని ఎన్నో కులాలకు పదవులిచ్చారని వివరించారు. తమ సహచర మంత్రులు, బీసీ నేతలు చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, కానీ బాబు, అయనకు వంత పాడుతున్న మీడియా ఈ స్పందనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
2014-19 రాష్టానికి ఏం చేశారో చెప్పాలని బాబుకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చద్రబాబును ప్రజలు ఎప్పుడో సాగానంపారని, అయన మాయ మాటలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.