Wednesday, March 26, 2025
HomeTrending NewsPeddireddy: నీకు ఉన్నది ఎకరం: బాబుపై పెద్దిరెడ్డి విమర్శలు

Peddireddy: నీకు ఉన్నది ఎకరం: బాబుపై పెద్దిరెడ్డి విమర్శలు

జగన్ ను ధనిక సిఎం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు అదే ఏడిఆర్ నివేదిక ఆయన్ను దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చెప్పిందని,  అది ఎందుకు చెప్పడంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. జగన్ ఏయే వ్యాపారాలు చేశారో బాబులు తెలియదా అని నిలదీశారు. ఈనెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురము జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత ఆర్ధిక సాయాన్ని ఇక్కడినుంచి లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు. సిఎం టూర్ ఏర్పాట్లపై సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించిన పెద్దిరెడ్డి డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు ఇటీవల చేసిన విమర్శలపై స్పందించారు.

బాబుకు రెండెకరాల భూమి మాత్రమే ఉండేదని, అది తమ్ముడితో వాటా పంచుకుంటే మిగిలేది ఒక ఎకరం మాత్రమే నని, అలాంటి బాబు దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా ఎలా ఎదిగారో చెపాలని డిమాండ్ చేశారు. ఒక డెయిరీని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. జగన్ కుటుంబానికి పవర్ ప్రాజెక్టులు, బైరైటీస్ గనులు ఎప్పటినుంచో ఉన్నాయని, జగన్ పై మాట్లాడేందుకు బాబుకు సిగ్గుండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్