Once More: వైఎస్ జగన్ సమసమాజ స్థాపనకు ప్రతినిధి అయితే, చంద్రబాబు తన సామాజిక వర్గ ప్రతినిధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం సాకారం చేసి చూపారని, పూలే ఆలోచనలను అమలు చేస్తున్నారని, అన్ని పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇలా గొప్ప సామాజిక విప్లవాన్ని సీఎం సాధించారని మంత్రి కొనియాడారు. తమ పాలనపై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, మెచ్చుకుంటున్నారని వెల్లడించారు. మహానాడులో మహిళా నేతలు అసభ్యంగా తొడలు కొడితే, బూతులు తిడితే సామాజిక న్యాయం అవుతుందా అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మాపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఉంటుందని.. అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తున్నందుకా? అని నిలదీశారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సామాజిక న్యాయభేరి జయహో జగనన్న బస్సుయాత్ర 16 జిల్లాల నుంచి సాగిందని, ప్రతి చోట ప్రజలు ఎంతగానో ఆదరించారాణి, 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ గతంలో సామాజిక ధర్మం పాటించలేదని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జగన్ సామాజిక ధర్మం, సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. వాటి కోసం తాము ఎక్కడా ఎక్కడా పోరాడలేదు. ఉద్యమించలేదని గుర్తు చేశారు. ఇవాళ అన్ని ప్రాంతాల వారూ 2024లో జగన్ వన్స్ మోర్ అని ముక్తకంఠంతో చెబుతున్నారని జోగి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.
లోకేష్ పాదయాత్రపై కూడా జోగి విమర్శలు చేశారు, ‘ఏదో పాదయాత్ర చేస్తారట. ఆయన ఎన్ని యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఛీకొడతారు తప్ప, ఆదరించరు. మేము గడప గడపకూ వెళ్తున్నప్పుడు జగన్ తమ సభ్యుడని ప్రతి కుటుంబం చెబుతోంది” అని వ్యాఖ్యానించారు.
Also Read : మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ