Sunday, January 19, 2025
HomeTrending NewsTDP: బాబు అరెస్ట్ జగన్ కు బూమరాంగ్ : అచ్చెన్న

TDP: బాబు అరెస్ట్ జగన్ కు బూమరాంగ్ : అచ్చెన్న

రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలకు చెందిన ఓట్లన్నీ కావాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  ఆరోపించారు. అర్హత లేని, ఆ బూత్ లో నివసించని వారి ఓట్లను చేర్చి అక్రమంగా గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని అచ్చెన్నాయుడు నేతృత్వం లోని టిడిపి ప్రనిది బృందం కలుసుకుంది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు కూడా ఈ విషయమై ఢిల్లీ వెళ్లి దీనిపి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

మొత్తం ఎన్నికల విధానాన్నే జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని, తాము ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి  నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారని ఈ విషయాన్ని కూడా మరోసారి సిఈఓకు చెప్పామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు వాలంటీర్లను ఉపయోగించి ఫారం 7, 6 లను విపరీతంగా దరఖాస్తు చేస్తున్నారని,  కేవలం అర్హత ఉన్నవారినే చేర్చాలని, అదే విధంగా తొలగింపుల ప్రక్రియను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే చేయాలని విజ్ఞప్తి చేర్చామన్నారు.

45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుపై సంబంధం లేని, అక్రమమైన కేసులు పెట్టి జైల్లో పెట్టారని, ౩4 రోజులైనా ఇప్పటి వరకూ అవినీతి నిరూపించలేకపోయారని అచ్చెన్న విమర్శించారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టిన విషయం స్పష్టమైందన్నారు. గతంలో జగన్ ను అరెస్టు చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు తప్ప వేరెవరూ బైటకు రాలేదని, కానీ బాబును అరెస్టు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆందోళనలు చేశారని, బాబు అరెస్ట్ జగన్ కు బూమరాంగ్ అయ్యిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయంగా వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందుకే జగన్ బైటకు వచ్చి బాబు అరెస్టు విషయం తనకు తెలియదని, కేంద్రం చేసిందని చెప్పారని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్