Saturday, November 23, 2024
HomeTrending NewsRains: రాత్రి నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Rains: రాత్రి నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ములుగు, యాదాద్రి భోనగిరి, వరంగల్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మబ్బులు కమ్ముకోవటంతో మధ్యాహ్నం రెండు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.  కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా వేకువజాము నుంచి వర్షం కురుస్తున్నది.

వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దుగ్గొండిలో 5.02, వరంగల్‌లో 4.6, నర్సంపేటలో 3.6, ఖిలా వరంగల్‌లో 3.4, గీసుకొండలో 3.2, ఖానాపూర్‌, చెన్నారావుపేటలో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్