Perni Nani Condemned The Nandamuri Family Members Comments :
నిన్న అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని, అసలు జరగని విషయాన్ని జరిగినట్లుగా చిత్రీకరించడం దురదృష్టకరమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. తన రాజకీయ అనుభవంతో చంద్రబాబు మెలో డ్రామా పండించారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె పేరు కూడా ఎత్తలేదని, కేవలం ఈ అంశాన్ని రాజకీయం కోసమే వాడుకుంటున్నారని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని నాని సూచించారు. నేడు నందమూరి కుటుంబ సభ్యులు అంతా మీడియాతో మట్లాడుతూ అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లపై మాట్లాడారాని, చంద్రబాబు చెప్పిన అంశాలను నమ్మి మాత్రమే ఇల్లా మాట్లాడి ఉంటారన్నారు.
నాడు ఎన్టీఆర్ గురించి చెడుగా చిత్రీకరించి, అయన రక్తం పంచుకు పుట్టిన కొడుకులు, కుమారులకే విషపు మాటలు ఎక్కించిన బాబుకు.. నిన్న జరిగిన అంశాన్ని రాజకీయం చేయడం తమకు కొత్తగా అనిపించలేదని, ఇలాంటివి చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని నాని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్సీపీపై రాజకీయంగా పైచేయి సాధించడానికే ఈ అంశాన్ని బాబు వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు శృతి మించి, దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణను ఓ అమాయక చక్రవర్తిగా నాని అభివర్ణించారు.
అసెంబ్లీలో ఫోన్లతో వీడియో చిత్రీకరించకూడదని, కానీ టిడిపి సభ్యులు వీడియో తీశారని, అసెంబ్లీ లో చంద్రబాబు మైక్ కట్ కాగానే వెంటనే వీడియో తీశారని అంటే ముందే ఓ ప్లాన్ ప్రకారం సభలోకి వచ్చారని, వీడియోలు తీయాలని ముందే నిర్ణయించుకుని వచ్చారని నాని వివరించారు. అసలు అసెంబ్లీలో గొడవలకు కారణం చంద్రబాబేనని, వ్యవసారంగంపై చర్చ జరుగుతుంటే, సిఎం జగన్ సభలో లేకపోయినా.. బాబాయి, గొడ్డలి, చెల్లి, తల్లి అంటూ మాట్లాడారని నాని గుర్తు చేశారు.
సాగు చట్టాలు ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దేశ వ్యాప్తంగా రైతులు సాధించిన విజయానికి సంఘీభావంగా నేడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ పిలుపు ఇచ్చిందని నాని వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు నిన్నటి సంఘటనకు నిరసనగా అందరూ మోకాళ్ళపై నుల్చోని, కొవ్వొత్తులు వెలిగించాలని విజ్ఞప్తి చేశారని, ఇంతకంటే దిగాజారడని అనుకున్న ప్రతిసారీ చంద్రబాబు మరో మెట్టు దిగుతూనే ఉన్నారని నాని వ్యాఖ్యానించారు.
Also Read : నోరు అదుపులో పెట్టుకోండి : బాలయ్య