దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.115.42కి చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి 101.58గా నమోదైంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ 91 పైసలు పెరిగి రూ.114.93గా, లీటర్ డీజిల్ 87 పైసలు పెరిగి రూ.101.10గా ఉన్నాయి.
మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.22 పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.117.61గా నమోదైంది. డీజిల్ ధర రూ.1.15 పైసలు పెరిగి రూ.103.35గా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 64 పైసలు పెరిగి రూ.116.06గా, లీటర్ డీజిల్ ధర 61 పైసలు పెరిగి రూ.101.88గా నమోదయ్యాయి. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 99.51 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందని వార్తలు వస్తున్నాయి.
Also Read : గ్రీన్ హైడ్రోజన్ తో పెట్రో ధరలకు కళ్ళెం