పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్రం కీ లక నిర్ణయం తీసుకుంది. చమురుపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 8/- డీజిల్‌పై 6/- ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు తీపికబురు అందించింది. వారికి గ్యాస్ సిలిండర్‌పై 200/- రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్‌పై అదనంగా మరో రూపాయిన్నర, డీజిల్‌పై అదనంగా మరో రూపాయి తగ్గే అవకాశం ఉంది. పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు వినిపించుకోని ధరలు మరింత పెరగకుండా కేంద్రం ఇప్పటికైనా శాంతించిందని వినియోగదారులు అభినందిస్తున్నారు.