Sunday, September 8, 2024
HomeTrending Newsదేశాభివృద్ధికి కలిసికట్టుగా పోరాడుదాం: మోడీ

దేశాభివృద్ధికి కలిసికట్టుగా పోరాడుదాం: మోడీ

దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మీడియానుద్దేశించి మాట్లాడారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని.. దేశం కోసం ఉందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. 2029 ఎన్నికల వరకు పార్లమెంట్ ను మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వినియోగించుకుందామని పిలుపు ఇచ్చారు.

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా, ఐదేళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేలా బడ్జెట్ ఉంటుందని, బడ్జెట్‌ సమావేశాల్లో మాట్లాడేందుకు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు, “ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు అంతా కలిసి దేశాభివృద్ధికి పోరాడాల్సిన అవసరం ఉంది.. సభను సక్రమంగా వినియోగించుకోవాలి.. కొత్త ఎంపీలకు అవకాశమివ్వాలి” అంటూ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్