కరోనా రెండో వేవ్ గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందని, గ్రామాలో టెస్టుల సంఖ్య పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. కరోనా కట్టడి, వాక్సిన్ల సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వారానికి గతంలో 50 లక్షల టెస్టులు జరిగితే ప్రస్తుతం 1.3 కోట్ల టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్మేంట్ జోన్లు ఏర్పాటుచేయాలని, ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు జరిపి చికిత్స అందించడంపై దృష్టి పెట్టాలని మోడీ ఆదేశించారు. కేసులు, మరణాల సంఖ్య విషయంలో రాష్ట్రాలు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.