Sunday, January 19, 2025
Homeజాతీయంరాష్ట్రపతితో ప్రధాని భేటీ!

రాష్ట్రపతితో ప్రధాని భేటీ!

PM meets President: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుసుకున్నారు. నిన్న గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన మోడీ అహ్మదాబాద్ లో తన తల్లి హీరాబెన్ మోడీని కలుసుకున్నారు. ఆమె వందో పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వాదాలు తీసుకున్న మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కు చేరుకొని కోవింద్ తో సమావేశమయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నేడో రేపో అభ్యర్ధిని ప్రకటించ తరుణంలో కోవింద్ తో మోడీ భేటీ భేటీ ఆసక్తిని కలిగించింది. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగి ఉంటుందని తెలుస్తోంది. తదుపరి అభ్యర్ధి విషయంలో కూడా మోడీ తన అభిప్రాయాలను కోవింద్ తో పంచుకొని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్