Tuesday, April 8, 2025
HomeTrending Newsజగన్‌కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

జగన్‌కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

#HBDJagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, పలువురు కేంద్రమంత్రులు కూడా ట్విటర్‌ ద్వారా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

ఏపీవ్యాప్తంగా సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టాయి. నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం, క్రీడా పోటీలు, కేక్‌ కటింగ్‌లతో కోలాహలంగా సంబరాలు జరుపుతున్నారు.

 

సిఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు సిఎం జగన్ కు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్తోన్నారు. క్రైస్తవ మత పెద్దలు కూడా జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహంచారు.

అనంతరం సిఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంవో అధికారులు, మంత్రులు తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజని, జోగి రమేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సిఎస్ డా. జవవర్ రెడ్డి, డిజిపి డా. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్