Polavaram:
తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందో టిడిపి నేతలకు తెలియదా అని అయన ప్రశ్నించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామంటూ గతంలో అనిల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తెలుగు దేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అనిల్ వీడియో లను ట్యాగ్ చేస్తూ మరీ కామెంట్లు పెడుతున్నారు. వీటిపై మంత్రి అనిల్ స్పందించారు.
పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా 2018 నాటికే నీరు అందిస్తామంటూ గతంలో నాటి మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను ఎందుకు ట్రోల్ చేయడం లేదని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ చేతగానితనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని, ప్సిల్ వే, కాఫర్ దయం ఒకేసారి నిర్మాణం చేపట్టారని అనిల్ ఆరోపించారు. వరదలకు డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని, టిడిపి హయాంలో డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విషయం వాస్తవం కాదా అని ఎదురుదాడి చేశారు. నిజాలు చెప్పే అలవాటు టిడిపి నేతలకు లేదని, వారు చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఏపీ సీఎంకు సిరివెన్నెల కుటుంబం ధన్యవాదాలు