Mundka Incident : ఢిల్లీ అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు పూర్తి అయ్యేందుకు మరో మూడు గంటలు పడుతుందని NDRF బృందాలు ప్రకటించాయి. అయితే 28 మంది ఆచూకి దొరకటం లేదని ఫిర్యాదులు వచ్చాయని, గాలింపు కొనసాగుతుందన్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు బాధ్యులైన బిల్డింగ్ యజమానులపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. యజమానులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలోకి వెళ్లేందుకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం NDRF బృందాలు తెలిపాయి.