Monday, January 20, 2025
HomeTrending NewsJaggareddy: బండి సంజయ్ ఏమైనా అధికారా?

Jaggareddy: బండి సంజయ్ ఏమైనా అధికారా?

Raids- Politics: ఈడీ, ఐటి శాఖలకు బండిసంజయ్ చీఫ్ అయినట్లున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆయా శాఖల అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతలపై బిజెపి కక్షపూరితంగా దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

బిజెపి-టిఆర్ఎస్ కలిసి రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని…. అమిత్ షా.. కేసీఆర్ మధ్య నువ్వు గిచ్చినట్టు చెయ్..నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇద్దరి మధ్య అవగాహన తోనే  రాజకీయం నడుస్తుందని,  ఈ రెండు పార్టీల మధ్య పంచాయతీలో తెలంగాణలో కాంగ్రెస్ ని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. మా బలహీనతలు అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయ ఎత్తుగడ అవలంబిస్తుందన్నారు.

మల్లారెడ్డి ఎప్పటినుంచో విద్యా సంస్థలు నడుపుతున్నారని, వ్యాపారం చేస్తున్నారని, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుండి సంపాదించారని… ఎనిమిది ఏళ్ళలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  దేవుళ్ళ కాలం లో కూడా క్యాసినోలు, క్లబ్బు లు ఉన్నాయని,  గోవా లో క్యాసినో ఫ్రీ అని… క్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని… అక్కడ అడే వాళ్ళను వదిలేసి తెలంగాణ కు వచ్చి దాడులు ఎందుకు చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడడం బాధాకరమన్న జగ్గారెడ్డి, ఏఐసిసిపై మర్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని తన శక్తి మేరకు బాగానే నడిపించారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్