Sunday, September 8, 2024
HomeTrending Newsఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం

ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఎయిర్‌ క్వాలిటీ (గాలి నాణ్యత) అధ్వాన్నంగా ఉన్నది. ఇవాళ నగరంలో యావరేజ్‌ ఎయిర్‌ క్వాలిటీ.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) ప్రకారం 337గా ఉన్నది. ఎయిర్‌ పొల్యూషన్‌ పెరిగిపోవడంతో నగరంపై దట్టమైన పొగమంచు కమ్మి ఉంది. కాలుష్యంతో పొగమంచు కమ్ముకొని రోడ్డు కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. కాగా, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం.

ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలను చేపట్టకూడదని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్