ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించిన ఏస్ డైరెక్టర్ మణిరత్నం. ఈయన మెగాఫోన్‌లో వచ్చిన విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వన్’. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్,శోభితా దూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, జయరాం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతుంది. రెండు భాగాలుగా వస్తున్న పొన్నియిన్ సెల్వన్‌లో మొదటి పార్ట్ ఈ ఏడాదిలో విడుదలైంది.
ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ 2ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారీ అంచనాల నడుమ అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో పొన్నియిన్ సెల్వన్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మించేలా మణిరత్నం అండ్ టీమ్ పొన్నియిన్ సెల్వన్ 2ను రూపొందిస్తున్నారు.