Craze-Cash: క్రేజీ హీరోయిన్ అంటే.. ఠక్కున గుర్తుకువచ్చే హీరోయిన్స్ లో పూజా హేగ్డే ఒకరు. ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ సినిమాలు చేస్తున్న టైమ్ లో అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక అక్కడ నుంచి టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. లతో నటించి క్రేజీ హీరోయిన్ అయ్యింది.
ఇక అసలు విషయానికి వస్తే.. కథానాయికగా బిజీగా ఉన్నప్పటికీ.. ఐటం సాంగ్ చేయడానికి కూడా రెడీ అంటోంది. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి అనే ఐటం సాంగ్ చేయడం ఆ సాంగ్ సూపర్ సక్సెస్ అవ్వడం తెలిసిందే. తాజాగా.. ఎఫ్ – 3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పూజను సంప్రదించగా దానికి ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే.. ఆ సాంగ్ కోసం పూజా హేగ్డే ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలు మాత్రం కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పించారట. ఏది ఏమైనా.. పూజాకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
Also Read : అది ఎక్కువగా భయపడిన సందర్భం : పూజా హేగ్డే