Sunday, January 19, 2025
Homeసినిమాజ‌న‌గ‌ణ‌మ‌న షూట్ లో పూజా చేరేది ఎప్పుడు?

జ‌న‌గ‌ణ‌మ‌న షూట్ లో పూజా చేరేది ఎప్పుడు?

Puri-Pooja-Vijay: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో లైగ‌ర్ మూవీ రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రం ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే పూరి జ‌గ‌న్నాథ్ జ‌న‌గ‌ణ‌మ‌న అనే భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.అయితే… ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న ముందుగా అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. పూరి జాన్వీనే అనుకున్నారు దాదాపు క‌న్ ఫ‌ర్మ్ ఇక అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం మాత్ర‌మే బ్యాలెన్స్ అనుకుంటే… జాన్వీ నో చెప్పి షాక్ ఇచ్చింది. ఆత‌ర్వాత క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను ఫైన‌ల్ చేశారు. ఫ‌స్ట్ టైమ్ పూజా హేగ్డే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించ‌బోతుంది.

పూజా.. జ‌న‌గ‌ణ‌మ‌న సెట్ లో జూన్ ఫ‌స్ట్ వీక్ నుంచి జాయిన్ కానుంది. విజ‌య్, పూజా పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంద‌రితో న‌టించిన పూజా ఇప్పుడు విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది.

Also Read : పూరి జ‌న‌గ‌ణ‌మ‌న ముహుర్తం ఫిక్స్(ఎక్స్ క్లూజీవ్)

RELATED ARTICLES

Most Popular

న్యూస్