Saturday, January 18, 2025
Homeసినిమాకేజీఎఫ్ హీరో స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ‌?

కేజీఎఫ్ హీరో స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ‌?

Yash-Pooja: ‘కేజీఎఫ్’ తో క‌న్న‌డ స్టార్ య‌శ్ పాన్ ఇండియా లెవ‌ల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 రిలీజ్ త‌ర్వాత …..య‌శ్ పేరు ఇండియా మొత్తం మార్మోగిపోయింది. దీంతో య‌శ్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆసక్తిగా మారింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా య‌శ్ తో సినిమా చేయాలనుకున్నారు. య‌శ్‌, దిల్ రాజు మ‌ధ్య మీటింగ్ జ‌రిగింద‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ క‌న్ ఫ‌ర్మ్అం టూ వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. కేజీఎఫ్ 2 త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ స‌లార్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యారు కానీ.. య‌శ్ మాత్రం నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. య‌శ్ నెక్ట్స్ మూవీని క‌న్న‌డ ద‌ర్శ‌కుడు న‌ర్త‌న్ డైరెక్ష‌న్లో చేయ‌నున్నాడ‌ని.. క‌న్న‌డ‌లో ఆర్ఆర్ఆర్ మూవీని పంపిణి చేసిన కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే… ఈ సినిమా కోసం పూజా హేగ్డేకు క‌థ చెబితే న‌చ్చి సినిమా చేస్తాన‌ని ఓకే చెప్పింద‌ట‌. దీంతో కేజీఎఫ్ హీరో య‌శ్, బుట్ట‌బొమ్మ‌ పూజా కాంబినేష‌న్లో మూవీ ఫిక్స్ అంటూ శాండిల్ వుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read : విజ‌య్ సినిమా కోసం పూజా అంత తీసుకుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్