Sunday, January 19, 2025
Homeసినిమా‘పాప్ కార్న్’ ను తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేస్తారు - నాగార్జున‌

‘పాప్ కార్న్’ ను తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేస్తారు – నాగార్జున‌

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్‘. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ లీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… ‘పాప్‌కార్న్’ మూవీ నిర్మాత‌లు చ‌ల‌ప‌తిరాజు, భోగేంద్ర గుప్తా గారికి అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. లిఫ్ట్ లో సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేసిన అజ‌య్‌కి అభినంద‌న‌లు. సినిమాను చ‌క్కా చేశాడు. నాకు బాగా న‌చ్చింది. ఆదిత్య మ్యూజిక్‌కి అభినంద‌న‌లు. డైరెక్ట‌ర్ ముర‌ళి టెన్ష‌న్ ప‌డ‌న‌క్క‌ర్లేదు. సినిమా డిఫ‌రెంట్‌గా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. అలాగే హీరో సాయిరోన‌క్‌కి ఆల్ ది బెస్ట్‌. నేను ప‌దేళ్ల ముందు బ్రెజిల్‌లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామ‌ని వెళ్లాను. అక్క‌డ అవికాగోర్ ముఖాన్ని చూశాను. చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌ను స్పానిష్‌లోనూ డ‌బ్ చేసుకున్నారు. అడిగితే అక్క‌డ సూప‌ర్ డూప‌ర్ హిట్ సీరియ‌ల్ అని చెప్పారు.

ఈ అమ్మాయిని మెచ్చుకుంటూ చాలా విష‌యాల‌ను అడిగారు. త‌ర్వాత 128 దేశాల్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌ను డ‌బ్ చేశార‌ని తెలిసింది. అవికా గోర్ ఎప్పుడో పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌. క‌జికిస్థాన్‌లోనూ రెండు సినిమాలు చేసింది. మేం మా టీవీలో పార్ట్‌న‌ర్స్‌గా ఉన్న‌ప్పుడు అందులో ప్ర‌సార‌మైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ టాప్‌గా నిలిచింది. అప్పుడు నాకు అవికా గోర్ ప‌రిచ‌యం. దాని త‌ర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాను రామ్మోహ‌న్‌ గారితో క‌లిసి నిర్మించాం. ఇప్పుడు లిఫ్ట్‌లో పాట‌, అవికా ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎన‌ర్జీ మామూలుగా లేదు. అవికా గోర్ హీరోయిన్‌గానే కాదు, నిర్మాత కూడా అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాలను ఆడియెన్స్ బాగా ఆద‌రిస్తున్నారు. అలాగే ఈ పాప్ కార్న్ సినిమాను పెద్ద హిట్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్