Monday, February 24, 2025
HomeTrending Newsకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఎల్లుండి (ఆగస్టు 28న) జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో తుది షెడ్యూల్‌ను నిర్ణయించనున్నట్లు గురువారం పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 21 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండా, అక్టోబర్ లేదా నవంబర్‌లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్‌పై ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకోనుంది.

సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న ‘భారత్ జోడో యాత్ర’లో పార్టీ నేతలు బిజీగా ఉండటం, సోనియాగాంధీ సహా రాహుల్, ప్రియాంక గాంధీలు విదేశాల్లో ఉండటంతో వాయిదా వేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించడానికి ఆగస్టు 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

‘‘కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక తేదీల ఖచ్చితమైన షెడ్యూల్‌ను ఆమోదించడానికి సీడబ్ల్యూసీ వర్చువల్ సమావేశం 28 ఆగస్టు 2022న మధ్యాహ్నం 3:30 గంటలకు నిర్వహించబడుతుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు’’ అని పార్టీ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ తెలిపారు.

Also Read :

కాంగ్రెస్ ప్రయోగం

RELATED ARTICLES

Most Popular

న్యూస్