Saturday, February 22, 2025
Homeసినిమాకోలుకున్న పవర్ స్టార్

కోలుకున్న పవర్ స్టార్

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడడం తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలకు, రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా బారినపడిన పవన్ కళ్యాణ్ కి వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నీరసం మాత్రం ఉందని, ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్‌ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియచేశారు.

తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు శ్రపవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్