Sunday, January 19, 2025
Homeసినిమాప్ర‌భాస్ 25వ చిత్రం ప్రకటనకు ముహ‌ర్తం ఖ‌రారు

ప్ర‌భాస్ 25వ చిత్రం ప్రకటనకు ముహ‌ర్తం ఖ‌రారు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. ప్ర‌భాస్ – పూజా హేగ్డే జంట‌గా న‌టిస్తున్న ఈ భారీ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ స‌లార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ 25వ చిత్రం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్ర‌భాస్ 25వ చిత్రానికి సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ ను ఈ నెల 7వ తేదీన తెలియ‌చేయ‌నున్న‌ట్టుగా ఈరోజు ప్ర‌క‌టించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మ‌రొక ఎత్తు అనే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.  బాహుబ‌లి త‌ర్వాత‌ ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు కొంత మంది టాలీవుడ్ ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు. మ‌రి.. వాళ్ల‌ల్లో ఎవ‌రు ప్ర‌భాస్ 25వ చిత్రాన్ని తెర‌కెక్కించే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్నారో.. ఎవ‌రు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారో… క్లారిటీ రావాలంటే ఈ నెల 7 వ‌ర‌కు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్