Saturday, March 29, 2025
HomeసినిమాAdipurush Review: ఇదేమి 'ఆదిపురుష్' ఓంరౌత్..?

Adipurush Review: ఇదేమి ‘ఆదిపురుష్’ ఓంరౌత్..?

ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ డైరెక్టర్. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు మనం ఎన్నో రామాయణాలు విన్నాం… ఎన్నో రామాయణాలు చూశాం.. కానీ ఈ ఉత్తరాది దర్శకుడు ఓంరౌత్ కనీవినీ ఎరుగని రామాయణాన్ని చూపించాడు. రాముడు, సీత, లక్ష్మణ్ పేర్లను మార్చేశాడు.

హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఒక్క సీన్ లో కూడా భక్తిభావం కలిగించలేకపోయాడు. ప్రభాస్, కృతి సనన్ కాస్టింగ్ 500 కోట్ల భారీ బడ్జెట్.. ఇస్తే ఓంరౌత్ ఇలా తీయడం ఏంటి అంటూ సినీ జనాలు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ 1.5 రేటింగ్ ఇచ్చాడంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిస్టులుగా ప్రభాస్, కృతిసనన్ పూర్తి న్యాయం చేశారు. డైరెక్టర్ ఓంరౌత్ ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా తీసినట్టు అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్