Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్, అనుష్క కాంబినేష‌న్ నిజ‌మేనా?

ప్ర‌భాస్, అనుష్క కాంబినేష‌న్ నిజ‌మేనా?

Hot combo:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, అందాల తార అనుష్క ఈ ఇద్ద‌రూ క‌లిసి ‘మిర్చి’ లో న‌టించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆత‌ర్వాత బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల్లో న‌టించారు. ఈ రెండు చిత్రాలు చ‌రిత్ర సృష్టించాయి. హిట్ పెయిర్ గా నిలిచిన ఈ జంట‌ అప్ప‌టి నుంచి మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌లేదు. అభిమానులు ఎప్పుడెప్పుడు క‌లిసి న‌టిస్తారా..?  ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. అభిమానుల కోరిక త్వరలో నెరవేరనుందని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. నిశ్శబ్దం సినిమా త‌ర్వాత‌ అనుష్క మరో సినిమా చేయలేదు. యు.వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో సినిమా చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ.. అందుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఆమెను దర్శకుడు మారుతి ఒప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే టాక్ నడుస్తోంది. దర్శకుడు మారుతి.. ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ అనుష్క న‌టిస్తే.. ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన ఆయన, ఆమెను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. మొదట్లో ఇది పుకారు అనుకున్నారు కానీ.. ఇది నిజమే అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ముందుకు వెళ్ల‌లేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్