Sunday, January 19, 2025
Homeసినిమాబిల్లా 4కె వెర్షన్ లో 23న రిలీజ్

బిల్లా 4కె వెర్షన్ లో 23న రిలీజ్

ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క, కృష్ణంరాజు నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకం పై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.ఈ నెల 23న 4కె వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ… ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక ఒరిజినల్ కథ చెప్పాను. దానికి బడ్జెట్ తక్కువ అవుతుంది. అలాగే ఈ ‘బిల్లా’ స్టోరీ చేద్దామన్నాను. దీనికి ఖర్చు ఎక్కువ. అయితే.. ప్రభాస్ తక్కువ బడ్జెట్ కథ ఎందుకు బిల్లానే చేద్దాం ఫిక్స్ చేయి ‘డార్లింగ్’Krishnam అన్నారు. అలా బిల్లా గోపీకృష్ణా మూవీస్ పతాకం పై ప్రారంభించాం. ఈ సినిమా కోసం మేము అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు కృష్ణంరాజు గారు. రెండు హెలికాప్టర్ లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం.

ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు నటించాలనే ఆలోచన ప్రభాస్ దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోను ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలి అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తూ కృష్ణంరాజు గారు మనకు దూరమయ్యారు. ఈ సినిమాను కేవలం నాలుగున్నర నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది. టీమ్ అంతా ప్యాషన్ తో వర్క్ చేశాం. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్ వైడ్ గా ఈ నెల 23న బిల్లా రిలీజ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయండి అన్నారు.

ప్రసీధ మాట్లాడుతూ… బిల్లా సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. నాన్నకు ఈ చిత్రాన్ని మళ్లీ అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే- ఇండియా డయోబెటిక్ ఫుట్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న కృష్ణంరాజు గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్