Sunday, January 19, 2025
Homeసినిమా'కన్నప్ప' కోసం రెడీ అవుతున్న ప్రభాస్!

‘కన్నప్ప’ కోసం రెడీ అవుతున్న ప్రభాస్!

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి చాలా కాలమవుతోంది. ఆయన నుంచి రావడానికి ‘కల్కి’ .. ‘ రాజా సాహెబ్’ రెడీ అవుతున్నాయి. ‘కల్కి’తో పోలిస్తే ‘రాజా సాహెబ్’ ఓ మాదిరి బడ్జెట్ సినిమానే అయినా, ఫస్టు లుక్ తోనే హైప్ తెచ్చుకుంది. ఈ సినిమాలను చక్కబెడుతూనే, ‘కన్నప్ప’ సినిమా కోసం రంగంలోకి దిగడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. మంచు విష్ణు టైటిల్ రోల్ ను పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శివుడి పాత్రలో కనిపించనున్నాడని టాక్.

శివుడికీ .. శివ భక్తుడైన కన్నప్పకి మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. శివుడికి పాత్రకి గాను ప్రభాస్ ను ఒప్పించారు. ప్రభాస్ కి గల క్రేజ్ కి ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించడానికి అంగీకరించడం నిజంగా విశేషమే. ఇక ఆయన సరసన పార్వతీదేవిగా నయనతార నటించనుంది. మంచు విష్ణుకి బంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను న్యూజిలాండ్ లోని ఫారెస్టు ప్రాంతంలో చిత్రీకరించారు. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది.

ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఎప్పుడు పాల్గొంటాడా అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17 .. 18 .. 19వ తేదీలలో ప్రభాస్ షూటింగుకు హాజరవుతాడని అంటున్నారు. ఆయనకి  సంబంధించిన సన్నివేశాలను ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేస్తారని చెబుతున్నారు.  న్యూజిలాండ్ లో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటుందని అంటున్నారు. మోహన్ లాల్ .. శివ రాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్