Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ అన్ స్టాపబుల్ పై 'ఆహా' అప్ డేట్

ప్రభాస్ అన్ స్టాపబుల్ పై ‘ఆహా’ అప్ డేట్

నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రీసెంట్ షో కు హీరోలు ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ గెస్టులుగా వచ్చిన సంగతి  తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదలై యూట్యూబ్ ని షేక్ చేసింది.

ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న ప్రసారం చేయనున్నట్లు ఇటీవల ఆహా వారు ప్రకటించారు. అయితే.. ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పై తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక కీలక పోస్ట్ చేశారు ఆహా టీమ్. ప్రభాస్, గోపీచంద్ ల క్రేజీ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నామని, అలానే అందులో మొదటి భాగాన్ని గతంలో ప్రకటించిన విధంగానే డిసెంబర్ 30న (బాహుబలి ది బిగినింగ్) , అలానే రెండవ ఎపిసోడ్ ని జనవరి 6న (బాహుబలి ది కన్ క్లూజన్) గా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

ఇది ఒక రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ఫ్రైజ్ అని చెప్పచ్చు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎంత మేర ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుని ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ ఎపిసోడ్ కి సంబందించి ప్రస్తుతం ఒక స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేసారు. అటు ప్రభాస్, ఇటు గోపీచంద్ ఇద్దరూ కూడా సరదాగా నటసింహం బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న ఈ ప్రోమో యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో దూసుకెళుతోంది. మరి.. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఎలాంటి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్