Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్‌ కల నిజమైన వేళ...

ప్రభాస్‌ కల నిజమైన వేళ…

dream come true: ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కె. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంటే.. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటిస్తున్నారు. ఇప్పటిదాకా ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే లేనట్టుగా, అత్యంత ఖరీదైన సెట్‌ను ఈ సినిమా కోసం రూపొందించారు.
ప్రాజెక్ట్ కె గురించి అమితాబ్‌ మాట్లాడుతూ.. ”ఫస్ట్ డే… ఫస్ట్ షాట్‌.. ఫస్ట్ ఫిల్మ్ విత్‌ ద బాహుబలి ప్రభాస్‌. ఆయన సమక్షంలో ఉన్న పాజిటివిటీ గొప్పది. అతని టాలెంట్‌, అతని పద్ధతి చాలా బావుంది” అని అన్నారు. ప్రభాస్‌ అయితే.. తన కల నిజ‌మైందని అన్నారు. ప్రాజెక్ట్ కె ఫస్ట్ షాట్‌ పూర్తయింది. లెజండరీ అమితాబ్‌బచ్చన్‌ సార్‌తో పని చేయడం ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు ప్రభాస్‌. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్న నాగ్‌ అశ్విన్‌ టేకప్‌ చేసిన ప్రెస్జీజియస్‌ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కె ని వైజయంతీ మూవీస్‌ పతాకం పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వనీదత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్