Sunday, January 19, 2025
Homeసినిమాప్ర‌భాస్ బెస్ట్ ఫ్రెండ్ అంటోన్న ర‌ణ‌భీర్

ప్ర‌భాస్ బెస్ట్ ఫ్రెండ్ అంటోన్న ర‌ణ‌భీర్

Best Friend: బాలీవుడ్ క‌పుల్స్ ర‌ణ్ బీర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం బ్ర‌హ్మ‌స్త్ర‌. ఇందులో బిగ్ బి అమితాబ్, కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషించ‌డం విశేషం. మ‌రో విశేషం ఏంటంటే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం. ఈ భారీ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను స్టార్ట్‌ చేస్తూ రణ్‌బీర్‌, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ  విశాఖపట్నంలో పర్యటించారు.

ఈ మూవీ ప్రచారం కోసం బ్రహ్మాస్త్ర  టీంతో జతకట్టాడు డైరెక్టర్‌ రాజమౌళి. వైజాగ్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో రణ్‌బీర్‌కు తెలుగులో ఆయన ఫేవరెట్‌ యాక్టర్‌ ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనికి వెంటనే రణ్‌బీర్‌ ప్రభాస్‌ అని సమాధానం ఇచ్చాడు. తెలుగు యాక్టర్స్‌ అందరూ గొప్పవారే కానీ.. అందులో ఒకరి పేరు చెప్పమంటే మాత్రం మై డార్లింగ్‌ ప్రభాస్‌ పేరు చెబుతాను. ఎందుకంటే.. అతను నా బెస్ట్‌ ఫ్రెండ్‌.

అంతే కాదు ప్రభాస్‌ అంటే అభిమానం కూడా అని చెప్పకొచ్చాడు రణ్‌బీర్‌. కాగా ఈ సినిమా బాలీవుడ్ లో బాహుబ‌లి లాంటిద‌ని నాగార్జున ఆమ‌ధ్య హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో తెలియ‌చేశారు. దీంతో బ్ర‌హ్మ‌స్త్ర సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్ 9న బ్ర‌హ్మ‌స్త్ర మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌రి.. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన బ్ర‌హ్మ‌స్త్ర ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : బ్ర‌హ్మాస్త్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్